27 June, 2026 | 8:20 PM

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక

27-06-2026 07:06 PM

బిజెపి అధిష్టానానికి కృతజ్ఞతలు: ఎర్రడాల మహేందర్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులుగా రెండవసారి ఎర్రడాల మహేందర్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మహేందర్ యాదవ్ ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ... జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా రెండవసారి అవకాశం ఇచ్చిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధముల ఆనంద్ గౌడు కు, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ కు సహకరించిన స్థానిక బిజెపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.