కోదాడలో కొణిజేటి రోశయ్య విగ్రహ స్థాపనకు భూమిపూజ
కోదాడ,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహ నిర్మాణ పనులకు కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై అత్యంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా భూమి పూజ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్నేని వెంకటరత్నం బాబు మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కొణిజేటి రోశయ్య అజాతశత్రువుగా, మచ్చలేని నాయకుడిగా పేరొందారని కొనియాడారు. వాసవి క్లబ్ అధ్యక్షులు ఓరుగంటి పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఉప్పలవంచు అశోక్, కోశాధికారి వెంపటి ప్రసాద్, క్లబ్ గవర్నర్ వీరవల్లి సతీష్ కుమార్, ఆర్ సి వంగవీటి నాగరాజు, జెడ్ సి షేకు శ్రీనివాస్, ఐఇసి వంగవీటి గురుమూర్తి వైస్ గవర్నర్ తళ్లపల్లి రాము, ఆర్యవైశ్య సంఘం నాయకులు పైడిమరి సత్తిబాబు, గరణే శ్రీధర్, వంగవీటి శ్రీనివాసరావు, ఇమ్మడి రమేష్, పైడిమర్రి నారాయణరావు, పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






