8 July, 2026 | 10:11 PM

పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

08-07-2026 09:28 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా మండల పంచాయితీ అధికారి రమేష్ బాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సమక్షంలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడిగా కె.రాంబాబు,ప్రధాన కార్యదర్శిగా వి.మురళీకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎస్.బాబు, వైస్ ప్రెసిడెంట్ గా జి.బన్సిలాల్, జాయింట్ సెక్రటరీగా ఏ.సంజీవరావు, ట్రెజరర్ గా ఏ.శ్వేత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.నానిబాబు, పబ్లిసిటీ సెక్రటరీగా ఎమ్.లక్ష్మీనారాయణ, అడ్వైజర్ గా పి.ఉమామహేశ్వర రావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా కె.శ్రీనివాసరావు, ఈ.సునేష్, పి.చంద్రశేఖర్, టి.కార్తీక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి డి.బాలోజీ పాల్గొన్నారు.