1 September, 2026 | 11:10 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

09-07-2026 | 12:31am

శంకర్ పల్లి, జులై 8 ( విజయ క్రాంతి): ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మోకిల తండాలో  బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చామ్ పే లెయంగి (32) ట్రాన్స్ఫార్మర్ను మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగలడం జరిగిందని తెలిపారు. చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి  వివాహం జరిగింది. 12 సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతుడికి మృతుడి బామ్మర్ది సైందు హైబుర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల ఎస్‌ఐ సురేష్ గౌడ్ తెలిపారు.