1 September, 2026 | 10:27 PM

ఓపీఎస్‌ కోసం రెవెన్యూ ఉద్యోగుల నిరసన

01-09-2026 | 09:35pm

* పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

*  మోతె తహసీల్దార్‌ వెంకన్న

మోతె,(విజయక్రాంతి): ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని (old pension system) అమలు చేయాలని మోతె తహసీల్దార్‌ ఎం. వెంకన్న(Mote Tahsildar M.Venkanna) డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు(Revenue employees) నల్ల రిబ్బన్లు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వెంకన్న మాట్లాడుతూ... ఉద్యోగులు తమ జీతాల నుంచి చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, పదవీ విరమణ అనంతరం ప్రతి నెలా పెన్షన్‌ అందేలా ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేసే ప్రజాపాలన ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ పుష్ప, ఆర్‌ఐలు కర్ణాకర్ రెడ్డి, రమేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుజిత్‌, టీజీపీవోస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, ఏఎస్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్లు రూప, ఉపేంద్ర, జీపీవోలు  తదితరులు పాల్గొన్నారు.