1 September, 2026 | 10:56 PM

Breaking News

కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •   భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •  

మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీఎన్జీఓల నిరసన

01-09-2026 | 10:19pm

కోదాడ,(విజయ క్రాంతి): టీఎన్జీఓ జేఏసీ(TNGO JAC) ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కోదాడ ఆర్డీఓ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ కోదాడ(Kodada) జేఏసీ అధ్యక్షుడు గడ్డం చిరంజీవి మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలుచేయాలన్నారు. నూతన పెన్షన్ విధానం వెంటనే రద్దు చేయాలన్నారు. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాత బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలుచేయాలన్నారు. ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఈ నిరసనలో కార్యదర్శి వెంకట నగేష్, మహేష్, ముస్తఫా, విక్రమ్, పవన్, చైతన్య, పులి శ్రీను, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.