1 September, 2026 | 11:15 PM

Breaking News

'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •  

పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు

01-09-2026 | 10:21pm

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పాపన్నపేట్(Papanpet) గ్రామంలో  సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ చేపట్టినట్లు తహసిల్దార్ రామ్మోహన్ రావు(Tahsildar Rammohan Rao) తెలిపారు. గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో సర్(SIR) ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారిపై విచారణ జరిపి, సర్ ప్రక్రియపై వివరించినట్లు తెలిపారు. ఓటు హక్కు సామాన్యుడి హక్కు ఆ ఓటు హక్కును కోల్పోకూడదని అర్హులైన వారందరూ ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని సర్ ప్రక్రియలో తప్పులు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.

సర్ అంటే ఏమిటి?

సర్ అంటే ఓటర్ల జాబితాను సరిచేసే ప్రక్రియ. దొంగ ఓట్లు, రెండు చోట్ల ఉన్న ఓట్లు తీసేయడానికి ప్రభుత్వం చేస్తుంది.

నోటీసు ఎందుకు వస్తుంది?

1. మీ పేరు రెండు ఊర్లలో ఉంటే

2. మీ ఫోటో సరిగ్గా లేకపోతే

3. మీరు ఇంట్లో లేరని BLO రాస్తే

4. ఆధార్ - ఓటర్ కార్డు కలవకపోతే నోటీసులు అందజేస్తారు.

నిజంగా ఆ ఇంట్లో ఉంటున్నారా లేదా అని చూస్తాడు. పక్కింటి వాళ్ళతో మాట్లాడి రిపోర్ట్ రాస్తారు.తహశీల్దార్ ఆఫీసులో ఏ ఈ ర్ ఓ మిమ్మల్ని పిలిచి అడుగుతారు. మీరు ఎక్కడ ఉంటున్నారో చెబితే అక్కడే మీ ఓటు ఉంచుతారు.వెళ్లి డాక్యుమెంట్లు ఇస్తే మీ ఓటు అలాగే ఉంటుంది వెళ్లకపోతే మీ పేరు జాబితా నుండి తీసేస్తారు. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలి.నోటీసు వస్తే భయపడొద్దు. ఇది మీ ఓటు తీసేయడానికి కాదు, సరిచేయడానికి ఇచ్చేది. 7 రోజుల్లో బి ఎల్ వో  ని కలవండి.మీకు వచ్చిన నోటీసు ఫోటో ఉంటే పంపండి, చూసి ఏం చేయాలో చెబుతారు. సర్ నోటీసులపై నోటీసులు వచ్చిన వారికి క్లుప్తంగా వివరించినట్లు తాసిల్దార్ తెలిపారు.