1 September, 2026 | 11:00 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి

01-09-2026 | 10:04pm

శివ సాయి మండల వినియోగదారుల సంఘం ప్రతినిధుల వినతి

కామారెడ్డి,(విజయక్రాంతి): రేషన్ వినియోగదారులకు సన్న బియ్యంతో పాటు చక్కెర, కిరోసిన్లను సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేయాలని కామారెడ్డి జిల్లా దోమకొండ మండల వినియోగదారుల అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం స్థానిక డిప్యూటీ తాసిల్దార్ బిక్షపతి కి వినతిపత్రం అందజేశారు. గతంలో రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు కిరోసిన్, చక్కెర గోధుమలు పామాయిల్ సబ్సిడీలపై పంపిణీ చేసేవారు. ప్రస్తుత పరిస్థితులలో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక చక్కని నలభై రూపాయల కేజీ ఉన్న చక్కెర ఒకేసారి 80 రూపాయలకు పెరగడంతో ఉదయం చాయో పాలు తాగలేని పరిస్థితిలో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రేషన్ షాపులో ద్వారా సన్న బియ్యంతో పాటు చక్కెర ,కిరోసిన్, గోధుమలు సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు బండారు శంకర్ ఉపాధ్యక్షులు జంగం చంద్రమౌళి కార్యదర్శి బొమ్మెర బాలయ్య, కోశాధికారి సామల లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు వల్కాటి నరేష్, సాప విజయ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.