1 September, 2026 | 11:00 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు

01-09-2026 | 09:39pm

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. పున్న నాగిని ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఒకే రోజు, కేవలం మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు నేరేడుచర్లకు ఎ. సునీత (22)అలింగపురం గ్రామం, పాలకవీడు మండలంనకు చెందిన ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా 2.8 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. అనంతరం మధ్యాహ్నం 2.18 గంటలకు బోతలపాలెం గ్రామం పాలకవీడు మండలంనకు కు చెందిన పి. సాత్వికకు సాధారణ ప్రసవం ద్వారా 2.7 కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు.

ఉదయం నుండి పురిటి నొప్పుల తో వచ్చిన గర్భిణీ స్త్రీలకు డా.పున్న నాగిని అన్నీ తానై వైద్య పరిచర్యలు అందించి వారు సుఖ, సురక్షిత ప్రసవం అవడానిక ప్రోత్సహించారు.ఈ సందర్బంగా డాక్టర్ నాగిని మాట్లాడుతూ,రెండు ప్రసవాలు సురక్షితంగా జరగడంతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, 24 గంటలు ప్రసూతి, గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఒకే రోజు తక్కువ వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం పీహెచ్‌సీ సిబ్బంది సేవా నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ,ఏ.ఎన్.ఎమ్ భూలక్ష్మీ, ఆశా కార్యకర్తలు, ఆయా లు జ్యోతి,దేవమ్మ పాల్గొన్నారు.