నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ
01-09-2026 | 10:24pm
అలంపూర్: నిరుపేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని(Chief Minister Relief Fund scheme) సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు(MLA Vijayudu) కోరారు. మంగళవారం కర్నూలు పట్టణంలోని తన కార్యాలయంలో రాజోలి మండలం టీ.గార్లపాడు గ్రామానికి చెందిన కేసపోగు రాజేష్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే విజయుడు బాధితుని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అర్హులైన వారు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో నాయకులు కిషోర్, అశోక్‌రెడ్డి, మన శ్రీనన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






