1 September, 2026 | 11:03 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

01-09-2026 | 10:11pm

బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం

నేరేడుచర్ల, (విజయ క్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్(fee reimbursement) బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఎటువంటి ఆటంకం లేకుండా తమ విద్యను సాగించేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ఎమ్మార్వో(MRO of Nereducherla) ఎస్. సైదులుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, ఈ బకాయిలు చెల్లించలేని దుస్థితి కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కళాశాలలో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఆపకుండా ఇచ్చేలా ఒక జీఓ ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.