కాంగ్రెస్ హామీలను విస్మరించింది: భిక్షమయ్య గౌడ్
ఆలేరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్(Former MLA Buludhu Bhikshamayya Goud) విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతు కూలీలకు(Farm laborers) రూ.12,500, పింఛన్ల పెంపు, పూర్తిస్థాయి రుణమాఫీ(Loan waiver) వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా, డీఏపీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించి, పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని భిక్షమయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేష్ ఎర్ర అశోక్, మొగులగాని మల్లేష్, జుకంటి అనిల్, కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ , బీజన మధు తదితరులు పాల్గొన్నారు.






