9 June, 2026 | 2:46 AM

విశ్రాంత ఉద్యోగులు నా కుటుంబసభ్యులు!

09-06-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రామచంద్రాపురం, జూన్ 8 : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు (రిటైర్డ్ ఎంప్లాయిస్) తన కు టుంబ సభ్యుల్లాంటి వారని.. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అంది స్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

సోమవారం రా మచంద్రాపురం డివిజన్ పరిధిలోని మ యూరి నగర్ కాలనీలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స న్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా వి శ్రాంతి ఉద్యోగుల సంఘానికి తనకు ఆత్మీ య అనుబంధం ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు అందిస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు.