ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన ఎంపీ
09-06-2026 12:00 AM
జహీరాబాద్, జూన్ 8 : జహీరాబాద్ మునిసిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి చీర ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనిస్, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, నాయకులు, మహిళ సంఘాల సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






