20 June, 2026 | 1:51 AM

నీట్ పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

21-06-2026 12:00 AM

-వరంగల్ పోలీస్ కమిషనర్

హనుమకొండ, జూన్ 19 (విజయక్రాంతి): ఆదివారం జరిగే  నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషన్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ నెల 21వ తారీకు  ఆదివారం జరిగే నీట్ పరీక్ష సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేయబడతాయని,ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్ష జరిగే 500 మీటర్ల పరిధిలో ప్రజలు గుంపులుగా గుమి కూడటం, 

సభలు సమావేశాలు ర్యాలీలు ధర్నాలు నిషేధించబడ్డాయని, అలాగే పరీక్షా జరిగే పరిసరాలలో పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు.ఈ ఉత్తర్వులు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.