20 June, 2026 | 1:56 AM

నాగిరెడ్డిపేట్‌లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్

20-06-2026 12:39 AM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ని ఆదరించండి

నాగిరెడ్డిపేట్ జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించండని తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం కార్యకర్తలతో నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ టిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఒంటి కాలితో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత పోరాటం చేస్తుందని తెలిపారు. ఒక మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఆదరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని బలపరచాలని కోరారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని టిఆర్‌ఎస్ పార్టీ ఎండగడుతుందని తెలిపారు. జరిగిన అవినీతిని బయటకు తీస్తూ ప్రజల ముందు ఉంచుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీలో పలువురు నాయకులు,కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీగారి సుభాన్ రెడ్డి,యూత్ అధ్యక్షులు పాయిం, జనరల్ సెక్రటరీ ఖలీల్, ఎస్సీ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బాగా రెడ్డి, మల్లారెడ్డి, సిద్ధిరాములు, ప్రవీణ్ కుమార్, జహీర్, పద్మక్క, శారద, బలరాం,విష్ణు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.