20 June, 2026 | 1:56 AM

పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన ఆర్మూర్ లయన్స్ గ్రీన్ ప్రతినిధులు

20-06-2026 12:41 AM

అర్మూర్, జూన్ 19 (విజయక్రాంతి): పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో అర్మూర్ లయన్స్ గ్రీన్ చార్టర్ ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా అమృత్ సర్ లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్ హర్దీప్ కర్కా వారికి స్వాగతం పలికారు. వారి డిస్టిక్ కి సంబంధించిన లయన్ పిన్ తో గౌరవించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని నివేదన్ గుజరాతీ తెలిపినారు. అనంతరం వారు అమృత్ సర్ లో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి గవర్నర్ వివరించడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా లైన్స్ క్లబ్ సేవలు విస్తరించబడటం అభినందనీయమని వారు కొనియాడారు. అందులో భాగంగా తెలంగాణలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ప్రతినిధులు కలవడం ఆనందదాయకమని నివేదన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో అర్మూర్ ప్రతినిధులు సంతాని విజయ్, నర్సా గౌడ్, అల్జాపూర్ అనిల్, ఒమాన్ శ్రీధర్, డాక్టర్ రజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల శ్రీనివాస్ గౌడ్, బొచ్కర్ నందకిషోర్ తదితరులు పాల్గోన్నట్లు వివరించారు.