23 August, 2026 | 12:18 AM

ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

22-08-2026 11:20 PM

నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్‌లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి రెటినా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి సుమారు 600 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్ అవసరమైన వారికి 4–5 రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని, కళ్లద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తామని రాజన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.