23 August, 2026 | 2:03 AM

మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ అండ

23-08-2026 12:09 AM

- రాంపురం తండాలో రూ.10 లక్షలతో నూతన వీవో భవనం

- ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు

- భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కీసర సంతోష్‌రెడ్డి

- మహిళల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి

మోతె,(విజయక్రాంతి): మహిళల అభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మోతె మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాంపురం తండాలో కోదాడ ఎమ్మెల్యే ఎన్‌. ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి సహకారంతో రూ.10 లక్షలతో మంజూరైన నూతన వీవో భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బానోతు సత్తెమ్మ శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ముడు, కాంగ్రెస్‌ నాయకులు కోర్ర రాములు నాయక్‌, పొట్టి, బానోతు రమేష్‌, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.