23 August, 2026 | 2:02 AM

27 నుంచి 20వ గ్రాండ్ నర్సరీ మేళా

23-08-2026 12:00 AM
  1. బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
  2. హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన
  3. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు

హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్‌షోను ఈనెల 27 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. శనివారం 20వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో నిర్వహిస్తున్న హార్టీకల్చర్‌షో బ్రోచర్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మెడిసినల్ ప్లాంట్స్‌ఇండోర్ ప్లాంట్స్, ఔ ట్‌డోర్ ప్లాంట్స్, పూల, పండ్ల మొక్కలు తదితర అన్ని రకాల హార్టీకల్చర్ ఉత్పత్తులను ఒకే వేదికపై కొనుగోలు చేసే అవ కాశం కల్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

ఈ మేళా ఆగస్టు 27 నుం చి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో, ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలో జరగనుంది. దేశవ్యాప్తం గా వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నర్సరీ మేళా ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్ తెలిపారు. మొక్కల పెంపకం, ఉద్యానవనం, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రజలు సందర్శించాలని నర్సరీ మేళా ఖాలీద్ అహ్మద్ కోరారు.