‘పవర్’ఫుల్ తెలంగాణే లక్ష్యం
- విద్యుత్ డిమాండ్‌కు దీటుగా ప్రణాళికలు
- పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం
- పారిశ్రామిక రంగానికి విద్యుత్, నీటి కొరత లేకుండా చర్యలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలి చిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి కొరత లేకుండా పారిశ్రామిక రంగానికి అవస రమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, పెట్టుబడిదారులు తెలంగా ణలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి థర్మల్, సోలార్, హైడల్, పంప్డ్ స్టోరేజ్, బ్యాట రీ స్టోరేజ్ వంటి అన్ని మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఎస్పీడీసీఎల్ నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్ డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ సాధిస్తున్న విజయాలు, తీసుకువస్తున్న సంస్కరణలు, ఆధునిక సాంకేతికతను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థు లకు అవగాహన కల్పించాలనే ఉద్దే శంతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగి నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు. గతంలో సుమారు 13 వేల మెగావా ట్లుగా ఉన్న పీక్ డిమాండ్ ప్రస్తుతం 18 వేల మెగావాట్లకు పైగా చేరిందన్నారు. అయినా ట్రాన్స్మిషన్ వ్యవ స్థను పటిష్టం చేయడం, ముందస్తు ప్రణాళికలు, అవసర మైన విద్యుత్‌ను సమయానుకూలంగా సమీకరిం చడం వల్ల సరఫరాలో అంతరాయం లేకుండా ప్రజలకు అందించామన్నారు. 1912 టోల్‌ఫ్రీ సేవలు, ‘పవర్ అంబులెన్సెస్’ ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సేవల్లో పారదర్శకత
విద్యుత్ శాఖలో సాంకేతికత వినియోగాన్ని పెంచుతూ ఇన్ హౌస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం అభినందనీ యమని భట్టి కొనియాడారు. వినియోగదారుడి నంబర్ ఆధారంగా అతని లొకేషన్, విద్యుత్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది వంటి సమాచారాన్ని సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీంతో విద్యుత్ సేవల్లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
భవిష్యత్ విద్యుత్ అవసరా లను దృష్టిలో పెట్టుకుని 2047 నాటికి లక్ష్యాలను నిర్దేశించుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కనీసం నాలుగైదేళ్ల సమయం అవసరమవుతుందని అన్నారు. అందువల్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
థర్మల్‌తో పాటు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం
థర్మల్ విద్యుత్‌తో పాటు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, సోలార్, హైడల్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యాలను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ రంగం వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం సహా ప్రతి ఉత్పత్తి రంగానికి పునాది వంటిదని, రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్‌లోనూ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు తావులేకుండా, పరిశ్రమల అవసరాలకు సరిపడే విద్యుత్ను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నా మని చెప్పారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
విద్యుత్ శాఖ చేపట్టిన సంస్కరణలు, విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.






