23-02-2026 07:32:38 PM
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో ఏళ్లుగా 4వార్డులో కొనసాగుతున్న తమ డ్రైనేజి సమస్యను పరిష్కరించాలంటూ నాలువ వార్డు ప్రజలు సోమవారం గ్రామసభలో సర్పంచ్ బండమీది కవిత గోపికి వినతిపత్రం సమర్పించారు. డ్రైనేజి లేక ఏళ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొoటున్నామంటూ వార్డు ప్రజలు సర్పంచ్ తో తమ ఆవేదనను వ్యక్త పరిచారు. అలాగే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటి సమస్యను తొలగించేలా చర్యలు చేపట్టాలనీ ఈ సందర్బంగా వార్డు ప్రజలు సర్పంచ్ ను కోరారు.
సమస్యపై స్పందించిన సర్పంచ్ సమస్యసాధనలో భాగంగా సత్వర చర్యలు చెప్పడతమనీ,కొత్త డ్రైనేజి నిర్మించి డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లను సవరించి నీటి కష్టాలను సైతం అతి త్వరలోనే తొలగిస్తామని వార్డు ప్రజలకు ఈ సందర్బంగా సర్పంచ్ బండమీది కవితగోపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు సిరిపురం కృష్ణ,సుద్ధాల శ్రీనివాస్,అరికిళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.