క్రైస్తవ మైనార్టీల పథకాలను సద్వినియోగం చేసుకోండి
08-07-2026 09:15 PM
కోదాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన క్రైస్తవ మైనార్టీల ఆర్థిక సంస్థ నుండి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కుట్టు మిషన్లు, ఆర్థిక సహాయం వ్యాపార ప్రారంభించడానికి , డ్రైవర్ సాధికారత కార్యక్రమం ఇతర పథకాలు అర్హులైన క్రైస్తవ సోదరీ సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తులు స్వీకరించడానికి ఈనెల 18 తారీఖున చివరి రోజు. కోదాడ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కోదాడ మాజీ క్రిస్టియన్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వంటిపాక జానకి ఏసయ్య, బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






