8 July, 2026 | 10:02 PM

క్రిస్టియన్ పాస్టర్ల మంథని డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక

08-07-2026 09:17 PM

పాలకుర్తి,(విజయక్రాంతి): పాలకుర్తి మండల పరిధిలోని జీటీ నగర్‌లో గల పాస్టర్ శామ్యూల్  చర్చిలో మంథని డివిజన్ పాస్టర్ల సమావేశం బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని అనేకమంది దైవజనులు, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర డివిజన్ అధ్యక్షుడు పాస్టర్ జనగామ శ్రీనివాస్ పాలు, ఉపాధ్యక్షుడు పాస్టర్ జకర్య, సెక్రెటరీ పాస్టర్ జోసెఫ్, జాయింట్ సెక్రెటరీ పాస్టర్ జాన్ వెస్లీ, ట్రెజరర్ పాస్టర్ అరుణ్ కుమార్ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ... దైవసేవలో ముందంజలో ఉంటూ, డివిజన్ పరిధిలోని పాస్టర్ల సంక్షేమానికి, ఐక్యతకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. తమను ఎన్నుకున్నందుకు తోటి దైవజనులందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు.