సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
08-07-2026 09:21 PM
బోథ్,(విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని ఏఐసీసీ తెలంగాణ విచార విభాగ్ కన్వీనర్ తుల అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాదులో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కి ఈ విషయమే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు తీసుకున్న అనంతరం రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి యోగితరానకు ఈ విషయమై వివరించడం జరిగిందన్నారు. అంతేగాక తన సమక్షంలోనే వినతి పత్రం ముద్ర వేసి సంతకం చేసి సంబంధిత అధికారులకు పంపించాలని ఆయన తెలిపారు మండలంలో అనేక గ్రామాల్లో పేద నిరుపేద విద్యార్థులు ఉన్నారని వారందరికీ నాణ్యమైన విద్య అందాలంటే కచ్చితంగా సునాల మండల కేంద్రంలోని పాఠశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్టు ఆయన తెలిపారు.






