8 July, 2026 | 9:12 PM

సమస్యలు పరిష్కరించాలని వినతి

08-07-2026 08:44 PM

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్సి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నెలకొన్న  సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనత పార్టీ  జిల్లా అధ్యక్షుడు నగునూరి  వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కోటపల్లి తహసిల్దార్  రాఘవేందర్ రావ్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు జిల్లాల  విద్యార్థులు చదువుకుంటున్న  పాఠశాల అధ్వాన్నంగా  ఉందన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్  వెంకటస్వామి చొరవ తీసుకొని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, పెద్దింటి పున్నం చంద్, మంత్రి రామయ్య, మండల ఎస్టి మోర్చా  మహేష్, కోటపల్లి బూత్ అధ్యక్షులు కాశెట్టి రాకేష్, మండల సీనియర్ నాయకులు  పూజారి సమయ్య, తదితరులు పాల్గొన్నారు.