ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చావా రామకృష్ణ
08-07-2026 08:42 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని సకన వీడు గ్రామంలో బుధవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మధిర ఏఎంసి చైర్మన్ చావా రామకృష్ణ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. గ్రామంలోని రామాల లక్ష్మణరావు మరియమ్మల దంపతులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించారు. బుధవారం నాడు కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశానికి మండల కాంగ్రెస్ సీనియర్ నేత చావా రామకృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించినారు.






