8 July, 2026 | 10:00 PM

ప్రత్యేక సమగ్ర సవరణపై రెండో విడత సమావేశం

08-07-2026 09:06 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై రెండో విడత బీఎల్‌వోలు, బీఎల్‌ఏల సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణతో పాటు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.

అర్హులైన ప్రతి ఓటరు వివరాలు తప్పులు లేకుండా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పని చేయాలని కోరారు.నిరక్షరాస్యులు, వృద్ధులు, దివ్యాంగులు ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన సహాయం అందించాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఈ సమావేశంలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.