8 July, 2026 | 10:00 PM

ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

08-07-2026 09:07 PM

 నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ బత్తుల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు

చిన్న చింతకుంట: మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి మాజీ శాసనసభ్యురాలు ఎస్. స్వర్ణ సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ​అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని కొనియాడారు.

నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆశయాలతో ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని, ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో కురుమూర్తి దేవస్థానం చైర్మన్ బత్తుల బాలరాజ్, వార్డు సభ్యులు శేఖర్, దేవి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పొర్ల వెంకటేశ్, ఉపాధ్యక్షుడు అహ్మద్, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.