8 July, 2026 | 9:50 PM

రేగుంటలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

08-07-2026 08:58 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పిల్లల ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి ప్రభుత్వ టీకాల షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలని, టీకాలు అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ దీప్తి, హెల్త్ అసిస్టెంట్ రవీందర్, ఏఎన్‌ఎం రాధ, ఆశా వర్కర్లు, నర్సులు పాల్గొని టీకాల ప్రక్రియను పర్యవేక్షించారు. గ్రామ ప్రజలు తమ పిల్లలకు సమయానికి టీకాలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు సహకరించాలని వైద్య సిబ్బంది సూచించారు.