ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయండి
08-07-2026 08:48 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి రెండోదశ ఇండ్లను వేగంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు వనమహోత్సవం, మంచినీటి సరఫరా విద్య వైద్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జిల్లాలో ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్ హౌసింగ్ పీడీ శ్రీనివాస్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు






