డీఈఓ కు వినతి పత్రం
ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లాలోఇటీవల ప్రీ ప్రైమరీ టీచర్లకు సంబంధించి 78 పోస్టులకు గాను నియామకాలు నిబంధనల ప్రకారం చేపట్టాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యక్షుడు జిల్లా నేత లు రాజేష్ నాయక్ డిఇఓ భోజన్నకువినతి పత్రం అందించారు. సాంకేతిక కారణాలవల్ల జిల్లాలో రెండు పోస్టులకు ఇంకా నియామకాలు చేపట్టలేదు అన్నారు దస్తురాబాద్ మండలం అకొండపేట ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కొరకు ఒకేషనల్ కోర్సులు ప్రీ ప్రైమరీ టీచర్ కోర్సు చేసిన అభ్యర్థికి పోస్ట్ చేసిన అభ్యర్థిని మొదట విద్యాశాఖ వారు ఎంపిక చేసి తర్వాత దాన్ని సాంకేతిక కారణాలతో నిలిపివేయడాన్ని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా దుయ్యబట్టింది అసలు నోటిఫికేషన్ లోనే స్పష్టమైన నియమక నిబంధనలు లేవని ఇంటర్ మార్కుల ఆధారంగానా లేకుంటే టిటిసి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చే అంశం లో స్పష్టత ఇవ్వాలని ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ భోజన ను కలిసి డిమాండ్ చేశారు అర్హత గల అభ్యర్థులను నోటిఫికేషన్ ప్రకారం నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సంబంధిత అభ్యర్థుల సర్టిఫికెట్ల విషయంలో రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు నివేదించామని అక్కడి నుంచి క్లారిఫికేషన్ వివరణ రాగానే ఆ కొండపేట పాఠశాల టీచర్లు నియమిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి హామీ ఇచ్చారు కార్యక్రమంలో బాధ్యత ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు






