బెజ్జూర్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమానికి శ్రీకారం
24-06-2026 05:36 PM
బెజ్జూర్ జున్ 24 (విజయ క్రాంతి): భారత ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను బెజ్జూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం సరోజ-తిరుపతి విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా,ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వైకుంఠం,వార్డు సభ్యులు గుమ్ముల శ్రీనివాస్,కోట రాజన్న,ఐకేపీ సిబ్బంది మంచెర్ల సురేష్,గ్రామ పంచాయతీ సిబ్బంది గోరెంట్ల వసంత్,అజీష్,సలీమ్ తదితరులు పాల్గొన్నారు.






