దేవాలయ భూముల కౌలు వేలం పాట
దమ్మపేట, జూన్ 24(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానము భూమూల కౌలు వేలం పాటను బుధవారం ఖమ్మం దేవాలయం ఇన్స్పెక్టర్ ఆనంద్, దేవాలయం ఈవో సూర్య ప్రకాష్ రావు నిర్వహించారు. ఈ వేలం పాటలో దమ్మపేట మండలంలోని రైతులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం 11 ఎకరాల వ్యవసాయ భూములకు మూడు సంవత్సరాల కాలానికి కౌలు వేలం పాట జరగ్గా మొద్దులగూడెం గ్రామానికి చెందిన జువ్వా రాంబాబు ఒక సంవత్సరానికి రూ.2,80,000/- ల చొప్పున దక్కించుకున్నారు.
అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం 11.09 ఎకరముల భూములను కౌలుకు వేలం పాట వేయగా దమ్మపేట గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేశ్వరావు ఒక సంవత్సరానికి రూ.1,35,000/- లకు దక్కించుకున్నారు. ఈ వేలం పాట కౌలు మూడు సంవత్సరాలు ఉంటుందని, ప్రతి సంవత్సరం రూ.1,35,000/- రూపాయలు చొప్పున చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ పానకాల సత్యనారాయణ, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం పసుమర్తి సత్యనారాయణ (సత్తిపండు), దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, పాకనాటి శ్రీనివాసరావు,చిన్నశెట్టి రమేష్, మండలంలోని రైతులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.






