చాత్రోన్ కీ గూంజ్ నిరసన
పాల్గొన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలు
నిర్మల్ జూన్ 24 ( విజయ క్రాంతి): ఏఐసీసీ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లో నిర్వహించిన "చాత్రోన్ కీ గూంజ్" కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు గారితో కలిసి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపిన నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారు, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత మరియు విద్యార్థుల హక్కుల సాధన కోసం పార్టీ చేస్తున్న పోరాటాలను నాయకులు వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. బీజేపీ మోదీ సర్కార్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిచేందుకు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని SAVE EDUCTION - SAVE YOUR FUTURE దేశంలోని యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రశ్నించడమే లక్ష్యం అన్నారు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ గారు మరియు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.






