బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా సందీప్ కుమార్
24-06-2026 05:33 PM
జైనూర్, జూన్ 24 (విజయక్రాంతి): బీజేపీ ఎస్టీ మోర్చా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జైనూర్ మండలం శివనూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సందీప్ కుమార్ నియమితులయ్యారు.బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్‌లు సందీప్ కుమార్‌కు నియామక పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఎస్టీ మోర్చాను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.






