24 June, 2026 | 6:47 PM

గ్రామ గ్రామాన మెగా హెల్త్ క్యాంప్

24-06-2026 05:41 PM

శ్రీ మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు నరేందర్ గుప్తా 

వెల్దుర్తి, జోన్ 24,( విజయ క్రాంతి ): వెల్దుర్తి మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ మహాలక్ష్మి మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ నిర్వాకులు కో్మిరి శెట్టి నరేందర్ గుప్తా వారు చెప్పినట్టుగానే మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా  శంషా రెడ్డి పల్లి గ్రామంలో బుధవారం  శ్రీ మహాలక్ష్మి మల్టీస్పెషల్టి హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు.

ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించారు. ఈ క్యాంప్ లో నరేందర్ గుప్తా క్యాంపు కు వచ్చిన గ్రామస్తులకు  ప్రథమ చికిత్స తో పాటు వారికి అవసరమగు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ గ్రామాన వారు చేస్తున్న ఉచిత మెగా క్యాంపును ప్రతి గ్రామ సర్పంచ్ నిర్వాహకులు *నరేంద్ర గుప్తా అలాగే  డాక్టర్ శ్రీకాంత్ వారి బృందాన్ని గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇకముందు కూడా వారి సేవలు ఇలాగే ఉంటాయని ఎవరైనా నిరుపేదలకు చికిత్స అవసరం ఉంటే తక్కువ ఖర్చుతోనే  వారి నర్సింగ్ హోమ్ యందు  చికిత్స చేయిస్తామని వారు తెలిపారు.