31 March, 2026 | 10:35 PM

చెరువు కట్ట మరమ్మత్తుకు శ్రీకారం

31-03-2026 08:55 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామ చౌట చెరువు కట్టకు ఇరువైపులా కంపచెట్లు పెరగడంతో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను గుర్తించిన గ్రామ యువకులు గ్రామ సర్పంచ్ నున్న యాదగిరి యాదవ్, సమీప రైతులు, గ్రామస్తుల సహకారంతో మంగళవారం జేసీబీతో దాదాపు కిలోమీటర్ మేర కట్టకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించారు.

అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు సర్పంచ్ యాదగిరి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్, రైతులు, యువకులు తేలు లింగయ్య, పరుశరాములు, నున్న లింగయ్య, అనిల్, తొడుసు మల్లేష్, వల్లపు అశోక్,వల్లపు శ్రీనివాస్, చిర్రబోయిన వెంకన్న, లింగయ్య, సాలయ్య తదితరులు ఉన్నారు.