28 July, 2026 | 2:34 AM

అదిలాబాద్ ముఖచిత్రం మారుతుంది

28-07-2026 12:46 AM
  1. ఒక వైపు ఎయిర్‌పోర్ట్.. మరోవైపు ఇండస్ట్రియల్ కారిడార్
  2. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మంజూరు ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా మారబోతోందని బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ..  ఒకపక్క ఎయిర్‌పోర్ట్, మరోపక్క ఇండస్ట్రియల్ కారిడార్ రావడంతో ఆదిలాబాద్ ముఖచిత్రం మారడమే కాకుండా నేషనల్ లాజిస్టిక్ హబ్‌గా, ట్రైపోర్ట్ కార్గో టెర్మినల్‌గా రూపాంతరం చెందుతుందన్నారు.