28 July, 2026 | 2:33 AM

ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం

28-07-2026 12:45 AM

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

గండీడ్, జూలై 27: ప్రతి కుటుంబానికి మంచి చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నామని  పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికల నిర్వహించిన కార్యక్రమంలో 74 మంది లబ్ధిదారులకు రూ 74,08, 584 లను కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  అధికారులు బాధ్యతగా వివరించాలని ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు సంప్రదించిన సమయంలో పూర్తిస్థాయిలో సమాచారం అందించి వారి సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఏ ఒక్క ఓటరు కూడా తొలగిపోకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. 

మండల అభివృద్ధే లక్ష్యం

పరిగి ఎమ్మెల్యే, డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, మండల స్థాయి అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై శాఖల వారీగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి, వాటిని నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఎల్‌ఏ లు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.

అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రజల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచి భగవంతచ రెడ్డి, పీసీసీ మెంబర్ నరసింహారావు. ఎంపీడీవోలు. మంజుల, నరేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారిని రాధమ్మ, కాంగ్రెస్ పార్టీ. మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.