చినుకు పడితే చిత్తడే..!
28-07-2026 01:43 AM
ఖమ్మంపల్లి కల్వర్టు బురదమయం పట్టించుకోని అధికారులు
మునిపల్లి, జూలై 27 : మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా కల్వర్టును నిర్మించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. వాన వస్తే మాత్రం కల్వర్టు వద్ద బురదమయంగా మారి రాకపోకలకు ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్రిడ్జి నిర్మించక ముందు అటుగా వెళ్లేందుకు కొంతవరకు ఇబ్బందులు పడుతుండడంతో కల్వర్టును నిర్మించారు. కానీ కల్వర్టు వద్ద నాణ్యత కూడిన మొరం వేయకపోవడంతో బురదమయంగా మారింది. దీంతో అటుగా వెళ్లాలంటే వాసన దారుడు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కల్వర్టు వద్ద సీసీ లేదా బీటి రోడ్డు వేసి తమ ఇబ్బందులను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






