‘ఫీజు’ బిల్లులు విడుదల చేయండి
- విద్యార్థులు నష్టపోకుండా చూడండి
- సీఎం రేవంత్‌రెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేయాలని, విద్యార్థులు నష్టపోకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధించడలో విద్యార్థులు కీలకమని, తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు చనిపోయారన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందని, విద్యార్థుల పోరాటం శుభసూచికమన్నారు.
కేంద్ర మంత్రి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారన్నారు.
21 ఏండ్ల యువతను విద్యాశాఖమంత్రిని చేసే బిల్లును అసెంబ్లీలో పెడతానన్న సీఎం రేవంత్‌రెడ్డికి తన మద్దతు ఉంటుందని వీహెచ్ పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రారంభించారని, ఆయన ఉన్నంత వరకు పీజు రీయింబర్స్‌మెంట్ జరిగిందన్నారు. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ చేయడం లేదన్నారు. ఓబీసీల ప్రతినిధిగా బీసీలు తనపై ఒత్తిడి తెస్తున్నారని వీహెచ్ చెప్పారు.






