28 July, 2026 | 12:54 AM

మానవత్వం చాటుకున్న అదనపు కలెక్టర్

28-07-2026 12:08 AM

దివ్యాంగురాలి వద్దకు వెళ్లి దరఖాస్తు స్వీకరణ 

మేడ్చల్, జూలై 27(విజయ క్రాంతి): మే డ్చల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ది వ్యాంగురాలి వద్దకు వెళ్లి దరఖాస్తు స్వీకరిం చి మానవత్వం చాటుకున్నారు. కలెక్టర్ స మావేశ మందిరంలో ప్రజావాణి ముగియగానే అదనపు కలెక్టర్ వేదిక దిగారు. ఇంత లోనే అటువైపు నుంచి దివ్యాంగురాలు ఉ మా నడవలేని స్థితిలో సమావేశ మందిరంలోకి వచ్చారు. వేదిక వెనుక నుంచి తన ఛాంబర్‌లోకి వెళ్లాల్సిన అదనపు కలెక్టర్ ఆమెను చూసి ఎదురెళ్లి దరఖాస్తు స్వీకరించారు.

తనకు సూరారంలో డబుల్ బెడ్ రూ మ్ ఇల్లు కేటాయించారని, ఎన్నికల కోడ్ వ ల్ల ఇవ్వలేదని, ఇప్పటివరకు పెండింగ్ లోనే ఉందని తెలిపారు. తనకు కేటాయించిన ఇల్లు ఇప్పించాలని కోరారు. అదనపు కలెక్టర్ ఆమె దరఖాస్తు వెంటనే సంబంధిత అధికారులకు అందించి సమస్య పరిష్కరించాలని సూచించారు. దివ్యంగురాలికి ఎదురెళ్లి దరఖాస్తు స్వీకరించడం పట్ల అక్కడున్న వారు అదనపు కలెక్టర్ ను కొనియాడారు. సాధారణంగా కారిడార్ లో వెళ్లేటప్పుడు ఎవరైనా వృద్ధులు, మహిళలు కనిపిస్తే వారి సమస్యను తెలుసుకుంటారు.