ఫామ్ పాండ్‌తో రైతులకు భరోసా
30-07-2026 01:34 AM
రామారెడ్డి, జూలై 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ఏఈఓ రాకేష్ పాల్గొని రైతులకు ఫామ్ పౌండ్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. రైతులు ముందుకు వచ్చి ఫామ్ పాండ్లు తవ్వించుకుని వర్షపు నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో నీటి కొరతను అధిగమించేందుకు రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లచ్చయ్య, ఉపసర్పంచ్ రమేష్, జీపీవో స్వామి, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, ఎఫ్‌ఏ భూమయ్య, వార్డు సభ్యులు శ్రీనివాస్, నవీన్, రైతులు బాలయ్య, లక్ష్మారెడ్డి, శంకర్, భైరయ్య తదితరులు పాల్గొన్నారు.






