29 August, 2026 | 4:15 AM

మందకృష్ణ పోరాటంతోనే వికలాంగ హక్కుల సాధన

29-08-2026 01:06 AM

ఇకనైనా వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: తిప్పారపు లక్ష్మణ్ 

మల్కాజిగిరి, ఆగస్టు 28, (విజయక్రాంతి) : వికలాం గులకు ఎన్నికల సమయం లో ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇం చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చే శారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి చౌరస్తాలో వికలాంగుల హ క్కుల పోరాట సమితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షు డు ఎన్ వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎం.జె.ఎఫ్ రాష్ట్ర నాయకులు మనో హర్ హాజరై జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ, వినయ్ మాది గ మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల కో సం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం విక లాంగుల హక్కుల పోరాట సమితి ఉద్య మాన్ని నిర్మించారని తెలిపారు. ఆ ఉద్యమం ద్వారా వికలాంగుల హక్కులు, ప్రయోజనా లు సాధించామన్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్ష న్ను పెంచి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్, రజిత, వెంకటేష్, నరసింహ, ఈశ్వరయ్య, అజిరా బేగం, సూరజ్, ప్రకాష్, మనోహర్, ఎస్.కీర్తి, తదితరులు పాల్గొన్నారు.