29 August, 2026 | 2:14 AM

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఎల్‌ఓసీ అందజేత

29-08-2026 01:06 AM

జవహర్‌నగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): జవహర్నగర్ సి.పి.ఐ కాలనీకి చెందిన సంకోజు గణేష్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నోజు సుధాకర్ చారి, బాధిత కుటుంబ పరిస్థితిని మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ముఖ్యమంత్రి సహాయ నిధి  ద్వారా  రూ,2, 00,000/- (రెండు లక్షల రూపాయల) విలువైన ఎల్.ఓ.సి ని మంజూరు చేయించారు.

మంజూరైన ఎల్ ఓ సి పత్రాన్ని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నోజు సుధాకర్ చారి నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఇం టికి వెళ్ళి అందజేశారు. కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి, అలాగే విషయా న్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సాయం అం దేలా చూసిన సుధాకర్ చారికి బాధిత కు టుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మాధ వ్, కేశవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.