29 August, 2026 | 5:20 AM

ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై యువకుడు అదృశ్యం

29-08-2026 01:05 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 28 (విజయక్రాం తి): ఆన్లైన్ గేమ్లకు అలవాటుపడి సుమారు రూ.6 లక్షల వరకు డబ్బు ఖర్చు చేసిన యు వకుడు అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఫి ర్యాదు వివరాల ప్రకారం.. రామకృష్ణ కుమారుడు యోగినంద (20) జేబీఐటీ కళాశా లలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్లు ఆడుతూ సుమారు రెం డేళ్ల క్రితం రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

నాలుగు నెలల క్రితం తల్లి జీతానికి సంబంధించిన రూ.24 వేల నగదును తీసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో అందులో రూ.10 వేలు తిరిగి ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి రూ.8 వేలు తీసుకుని హోండా షైన్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కుమారుడికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

అతడి స్నేహితులు, బంధువులు, తెలిసిన వారిని విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించి, తన కుమారుడిని గుర్తించి ఆచూకీ తెలియజేయడంతోపాటు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అదృశ్యమైన యువకుడి కోసం గాలిస్తున్నారు.