15 May, 2026 | 1:49 AM

పుస్తకం చదివితే జీవితంలో గుర్తింపు

15-05-2026 12:42 AM

నందిని సిద్ధారెడ్డి

ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి): పుస్తకం చదివిన వారికి జీవితం తెలుస్తుందని, రాసిన వారికి సమాజంలో గుర్తింపు వస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు బొగ్గుల కుంటలోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో 2026 సంవత్సరానికి వివిధ ప్రక్రియ ల్లో ఉత్తమ గ్రంథాల పురస్కారాలు, సాహిత్యరంగంలో లబ్ద ప్రతిష్టులైన పెద్దలకు వరిష్ఠ పుర స్కారాల ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సెల్ ఫోన్‌కు దూరంగా పుస్త కాలు చదివేందుకు దగ్గరగా ఉండటం మనకూ సమాజానికి మంచిదన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిస్తూ న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని అనుసరించి నిష్పక్షపాతంగా పురస్కారాలను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. పురస్కార గ్రహీతలకు రూ. 20వేలు, జ్ఞాపిక, శాలువా కప్పి సత్కరించారు. 

ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి సంబరం..

ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లోని సుర వరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో ‘90 వసంతాల ఆకాశవాణి సంబరం-పల్లె పాట లు పండుగ’ పేరుతో ప్రత్యేక జానపద విభావరిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బానోత్ మాట్లాడారు.

1936లో ప్రారంభమైన ఆకాశవాణి ప్రసార మాధ్యమమే కాదని, అన్ని విధాలుగా ప్రత్యేక స్థానం సంపాదించిందని అన్నారు. ప్రముఖ కవి గోరెటి వెంకన్న మాట్లాడుతూ..తెలుగుభాష వికాసానికి ఆకాశవాణి చేసినసేవలు చిరస్మరనీయమన్నారు. డిజిటల్ యుగంలోనూ ఏ మాత్రం వన్నె తగ్గకపోవడం గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో దూరదర్శన్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఎన్.వీ.రమణ, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, మార్కెటింగ్ హెడ్ టి.ప్రసన్న, ఇంఛా ర్జ్ ప్రొగ్రామ్ హెడ్ సీమకుమారి, అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీరామ్ గోపాల్, నిహార కానేటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ నీలిమా, డాక్టర్ బిక్షా కేతావత్, శాంతిశ్రీ, డాక్టర్ సాంబశివరావు, లావణ్య, డాక్టర్ వీరన్న, సందీప్ వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కళాభిమానులు, జానపద ప్రియులు, శ్రోతలు పాల్గొన్నారు.