టీఆర్‌ఎస్‌లోకి బీఆర్‌ఎస్ సీనియర్ నేత
టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడుగా చుక్క సాయ గౌడ్
సదాశివనగర్, మే 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండల బీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కుప్రియాల్ చుక్క సాయ గౌడ్ గురువారం హైదరాబాద్లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సాయ గౌడ్ తన అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్ లో చేరారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయనకు సదాశివ్ నగర్ టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా సాయా గౌడ్ మాట్లాడుతూ సదాశివ నగర్ మండలంలో టిఆర్‌ఎస్ పార్టీ పటిష్టానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు కవితక్క, జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.






