గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో లేని ఇబ్బందులు రేవంత్ రెడ్డి పాలనలో ఎందుకు వస్తున్నాయి
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, మే 14 ( విజయక్రాంతి ) :గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో లేని ఇబ్బందులు రేవంత్ రెడ్డి పాలనలో ఎందుకు వస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పొలాల్లో ధాన్యం కుప్పల తెప్పలుగా పోసి ఉండటం, వర్షాల భయంతో రైతులు అరచేతుల్లో ప్రాణం పెట్టుకుని వేచి చూస్తున్నారని, లారీలు రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఒక బస్తాకు సగటున 3.2 కేజీ కటింగ్ (క్వింటాల్కు 7.5 కేజీలు) చేస్తున్నారని, ధాన్యం కల్లాల్లో పోసి నెల రోజులు అవుతున్నా, ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.
ఇది రైతులను నట్టేట మంచే ప్రయత్నంగా ఆరోపించారు.ధర్మపురి నియోజకవర్గ మంత్రి, కలెక్టర్, కాంగ్రెస్ నాయకులకు పట్టింపు లేదా,ఈ పరిస్థితి గ్రామానికి మాత్రమే కాక, రాష్ట్రమంతా నెలకొందని ఆయన అన్నారు.మొక్కజొన్నలు, మక్కలు వర్షాల్లో తడిసిపోతున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానం అని, ఎన్నికల్లో రైతు డిక్లరేషన్ పేరుతో 36 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు.
బి ఆర్ ఎస్ లో కెసిఆర్ నాయకత్వంలో నీళ్లు, 24 గంటల కరెంట్, పంట పెట్టుబడి, ఎరువులు సకాలంలో అందించారని తెలిపారు.కాంగ్రెస్ వచ్చాక అంతా ఆగిపోయిందని ఆరోపణ చేశారు.ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని,కటింగ్లు ఆపాలి. ఈ బాధ్యత మంత్రి, కలెక్ట్ప ఉందని బి ఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






